
- తర్జనభర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
- రెవెన్యూ సదస్సుల్లో భారీగా వస్తున్న సాదాబైనామా దరఖాస్తులు
- గత సర్కార్ లో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9.24 లక్షలు
- పాతవాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూ భారతి చట్టం
- కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్. వెలుగు: భూ భారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీ సుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు సమస్యగా మారాయి. వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నది. ధరణి పోర్టల్ లోని పెండింగ్ లో ఉన్న 9.24 లక్షల సాదాబై నామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అదే స్థాయిలో సాదాబైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నా యి. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సుల్లో సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులే 30 శాతం దాకా వచ్చినట్లు తేలింది.
వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదాబై నామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సాదాబైనామాలకు సంబంధించి పాతదరఖా స్తులకు మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలో పొందుపర్చిన ప్రభుత్వం.. కొత్త సాదాబైనామా దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
4 మండలాల్లోనే సాదాబైనామాలకు 3వేల అప్లికేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూ భారతి చట్టాన్ని తీసు కువచ్చింది. దీనికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను గత నెలలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూ భారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, మద్దూర్, వెంకటాపూర్ను పైలట్ మండలాలుగా ఎంచుకున్నది.
కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం
భూ సమస్యల పరిష్కారం కోసం ఈ మండలాల్లో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నది. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులను పూర్తిచేశారు. నాలుగు మండలాల్లో 11 వేలపైన దరఖాస్తులు వివిధ సమస్యలపై వస్తే... అందులో దాదాపు మూడు వేల అప్లికేషన్లు సాదా బైనామాలకు సంబంధించినవే ఉన్నాయి.
ఇప్పుడు ఇంకో 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ముగింపు దశకు చేరుకున్నాయి. వీటిల్లోనూ 30 శాతం అప్లికేషన్లు సాదాబైనామాల కిందవచ్చినవే ఉన్నాయి. ఇందులో గతంలో ఆన్ లైన్ లో తీసు కున్న పాత అప్లికేషన్లు కాకుండా కొత్తవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్త వాటిని పరిష్కరించే మార్గం లేకపోవడంతో ఇదే విషయాన్ని అధికారు లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
ఐదేండ్ల నుంచి పెండింగ్!
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2020 నవంబర్ 10వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటే తొమ్మిది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే అప్పటి ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) చట్టంలో సాదాబైనామా అంశాన్ని పొందుపరచకపోవడం తో ఆ దరఖాస్తుల పరిష్కరం సాధ్యం కాలేదు. అప్లి కేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. నాటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది.