NIA కొత్త డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాటే

NIA కొత్త డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్  దాటే

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాటే.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)  నూతన డైరెక్టర్ జనరల్ గా ఆదివారం (మార్చి31) పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 31, 2026 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. 

సదానంద్ వసంత్ దాటే మహారాష్ట్రకు చెందిన 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. ఆయన మహారాష్ట్రలో పలు శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మిర్ భయాందర్ వాసాయ్ విరార్ పోలీస్ కమిషనర్ గా, ముంబై క్రైం బ్రాంచి జాయింట్ కమిషనర్ గా, ముంబై లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ గా పనిచేశారు. సీఆర్ పీఎఫ్ ఐజీగా, రెండుసార్లు సీబీఐ డిప్యూటీ ఇన్ స్పెక్టర్  జనరల్ గా ఆయన విధులు నిర్వహించారు. 

సదానంత్ వసంత్ దాటే 2008 భారత రాష్ట్రపతి చేత పోలీస్ మెడల్ గ్యాలెంటరీ అవార్డు  అందుకున్నారు. 26/11 ముంబైదాడి తర్వాత ఉగ్రవాది కసబ్ తో పోరాడుతూ గాయపడ్డాడు. కసబ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 

ప్రస్తుత డైరెక్టర్ దినకర్ గుప్తానుంచి ఆయన అధికార పగ్గాలు చేపట్టారు. దినకర్ గుప్తా పదవీకాలం ఆదివారం(మార్చి 31)తో ముగియడంతో ఆయన పదవీ విరమణ చేశారు.