ప్రీతి మృతితో గిర్నితండాలో విషాద ఛాయలు

ప్రీతి మృతితో గిర్నితండాలో విషాద ఛాయలు

మెడికో స్టూడెంట్ ప్రీతి మృతదేహం ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చేరుకుంది. ఆమె డెడ్ బాడీని చూసిన తండావాసులు, బంధువులు బోరున విలపించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ప్రీతి మృతితో తండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల సెక్యూరిటీతో నిండిపోయాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రీతి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పోలీసులు బంధువులపై ఒత్తిడి తెస్తుండడంతో ఇయ్యాళ   చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.