
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ తెరకెక్కించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అతిథిగా హాజరైన సోహెల్, వీడియో బైట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
నవదీప్ మాట్లాడుతూ ‘దర్శకుడు కొత్త ఆర్టిస్టుల నుండి మంచి కామెడీని రాబట్టారు. ఇందులో చికెన్ అనేది ఒక ఎమోషన్. కేర్ ఆఫ్ కంచరపాలెం, బలగం చిత్రాల తరహాలో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుండటం హ్యాపీ’ అన్నాడు హీరో రవి. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆ వరుసలో చేరుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల కానుంది.