రిపబ్లిక్ మూవీ రివ్యూ 

రిపబ్లిక్ మూవీ రివ్యూ 

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: సాయి ధరమ్ తేజ్,ఐశ్వర్య రాజేశ్,రమ్యకృష్ణ, జగపతి బాబు,సుబ్బరాజు,రాహుల్ రామకృష్ణ, సురేఖా వాణి తదితరులు.
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: జె.భగవాన్,జె.పుల్లారావు
రచన, దర్శకత్వం: దేవకట్టా
రిలీజ్ డేట్: అక్టోబర్ 1,2021

కథేంటి?
అభిరాం (సాయితేజ్) చిన్నప్పటి నుండి న్యాయంగా ఉంటూ అన్యాయన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు.దారి తప్పిన అధికారుల వ్యవస్థ అంటే నచ్చదు.అది మారాలనీ,అప్పుడు సమాజం బాగుపడుతుందని కోరుకుంటాడు.అమెరికా వెళ్లాలనుకొని ఇక్కడ కొన్ని అన్యాయాలు చూసి కలెక్టర్ గా మారతాడు.తర్వాత రాజకీయ నాయకురాలు విశాఖ వాణి (రమ్యకృష్ణ) తెల్లేరు అనే మంచి నీటి సరస్సును చేపల వ్యాపారం పేరుతో కలుషితం చేసి డబ్బు సంపాదిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాని వల్ల చాలా మంది చనిపోతుంటారు.కలెక్టర్ పవర్ తో ఆ అన్యాయాన్ని అభిరామ్ ఎలా అరికట్టాడు? చివరకు వ్యవస్థను మార్చాలని తను అనుకున్న పని అయిందా? అనేది సినిమా చూపి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సాయి ధరమ్ తేజ్ వ్యవస్థ మారాలని తపించే యంగ్ కలెక్టర్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు.మంచి నటన తో మెప్పించాడు.ఐశ్యర్య రాజేష్ పాత్ర చిన్నదే అయినా ఇంపార్టెన్స్ ఉంది.నెగిటివ్ షేడ్స్ ఉన్న పొలిటికల్ లీడర్ పాత్రలో రమ్యకృష్ణ మరోసారి రాణించింది.జగపతిబాబు పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది.అతను మరోసారి ఆకట్టుకున్నాడు. సుబ్బరాజు,రాహుల్ రామకృష్ణ,సురేఖా వాణి తదితరులు వాళ్లకు అలవాటైన పాత్రల్లో బాగా చేశారు.

టెక్నికల్ వర్క్: 
సుకుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.మణిశర్మ అందించిన పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.కొన్ని సార్లు బోర్ కొడుతుంది.ఆర్ట్ వర్క్,డిటెయిలింగ్,ప్రొడక్షన్ వాల్యూయ్స్ అన్ని బాగా కుదిరాయి..దేవకట్టా రాసుకున్న డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి.ఆలోచింప చేస్తాయి.

విశ్లేషణ:
‘‘రిపబ్లిక్’’ సీరియస్ మూవీ. పొలిటికల్ నాలెడ్జ్, బ్యూరోక్రసీ గురించి తెలిసిన వాళ్లు కనెక్ట్ అవుతారు. ఇంత సీరియస్ మూవీకి కమర్షియల్ అప్సీల్ చాలా తక్కువ.దేవకట్టా అనుకున్న పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఇలాంటి సినిమాలకు స్టార్ అప్పీల్ ఉంటే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది.కానీ సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో ఇంత సీరియస్ సబ్జెక్ట్ ను హ్యండిల్ చేయలేకపోయాడు.   తన వరకు బాగానే ప్రయత్నించినా ఆడియన్స్ కు సరిగా కన్వే కాదు. డైరెక్టర్ దేవకట్టా కూడా ఈ సబ్జెక్ట్ ను మరింత సీరియస్ గా కాంప్లికేటెడ్ గా చెప్పాడు.అక్కడే ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అవుతాడు.ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ బోరింగ్ గా సాగుతుంది.దీనివల్ల ప్రేక్షకుడు సహనం కోల్పోతాడు. ఇలాంటి సినిమాలకు జనరల్ గానే ప్రేక్షకులు ఎక్కువసంఖ్యలో థియేటర్లకు రారు.వాళ్లకు అర్థమయ్యే రీతిలో,ఎంటర్ టైనింగ్ గా సింపుల్ గా చెప్తే బాగుంటుంది కానీ,దేవకట్టా సీరియస్ గా చెప్పాడు.కొన్ని డైలాగులు కూడా అర్థంకాకుండా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు భారంగా,సీరియస్ గా అనపిస్తుందే తప్పా.. ఎక్కడా ఎంజాయ్ చేయలేం.ఓవరాల్ గా ‘‘రిపబ్లిక్’’ నిరాశపరుస్తుంది.

బాటమ్ లైన్: అర్థవంతమైన సినిమానే కానీ అర్థం కాదు.