హీరోయిన్ ప్రేమలో మరో మెగా హీరో.. త్వరలో పెళ్లి?

హీరోయిన్ ప్రేమలో మరో మెగా హీరో.. త్వరలో పెళ్లి?

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej)ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya thrapati)తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ న్యూస్ చాలా మందిని షాక్ కు గురిచేసింది. ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాకూడా బయటపడకుండా చాల జాగ్రత్తగా మైంటైన్ చేశారనే కామెంట్స్ కూడా వినిపించాయి. 

అయితే ఇప్పుడు మరో మెగా హీరో కూడా ఇలాంటి షాకివ్వడానికి సిద్ధమయ్యాడట. అతను మరెవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej). ఈ హీరో కూడా ఒక హీరోయిన్ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చేసిన రెజీనా కసాండ్రా(Ragina Cassandra).

గతం నుంచి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నా.. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. మరో మెగా హీరో పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలోని వార్తలను బయటకు తీసి.. ప్రచారం చేయటం విశేషం. ఇటీవల సాయి తేజ్ ను మీ ఫెవరెట్ హీరోయిన్ ఎవరు అని అడగగా.. రెజీనా పేరు చెప్పాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక మరో మెగా హీరో పెళ్ళికి సిద్దమయ్యాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.