సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై జరుగుతోన్న వేధింపుల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన సాయి తేజ్ ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరుకు గాను కృతజ్ఞతలు తెలియజేశాడు.
సీఎంతో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తేజ్ ‘పిల్లల వేధింపులను అరికట్టడానికి నాతో చర్చించడానికి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ రేవంత్ అన్నా’ అని ట్వీట్ చేశాడు.