Sai pallavi : వాటికి అంతలా కనెక్ట్ అవ్వలేదు : సాయిపల్లవి

Sai pallavi : వాటికి అంతలా కనెక్ట్ అవ్వలేదు : సాయిపల్లవి

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి రూమర్స్ కి, కాంట్రవర్సీలకి దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ భామకు సంబంధించిన  ఓ రూమర్ ఇప్పుడు  సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. ఇంతకి అదేంటంటే.. ఇటీవల సాయిపల్లవి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. దీంతో ఇక ఆమె డాక్టర్ గానే సెటిల్ అవుతుందని, సినిమాలు చేయడం మానేస్తుందంటూ  వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై  స్పందించిన సాయిపల్లవి ఆ వార్తలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చింది. 

‘నేను ఎంబీబీఎస్ చదివా. డ్యాన్సర్, యాక్టర్ కావాలన్నది నా డ్రీమ్. నా నిర్ణయానికి అమ్మానాన్న కూడా అడ్డు చెప్పలేదు. నేను చేసిన సినిమాలు, పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటాను. నన్ను ఇష్టపడేవాళ్లు కూడా అదే కోరుకుంటారు. మంచి స్టోరీలు, పాత్రపై స్కోప్ ఉంటే ఏ భాషలో నటించేందుకైనా నేను రెడీ. ఇప్పటికి చాలా కథలు విన్నా. వాటికి అంతలా కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది’ అని చెప్పింది. 

 గార్గి తర్వాత సాయిపల్లవి మరొక సినిమాలో నటించలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు కూడా సైన్ చేయలేదు. రణ్ బీర్ కపూర్ తో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చినా వదులుకుంది. దీంతో ఈ రూమర్స్  మరింత బలపడ్డాయి.