Sai Pallavi: కోలీవుడ్‌లోకి సాయిపల్లవి రీఎంట్రీ.. శింబుతో జోడీ కడుతున్న నేచురల్ బ్యూటీ

Sai Pallavi: కోలీవుడ్‌లోకి సాయిపల్లవి రీఎంట్రీ.. శింబుతో జోడీ కడుతున్న నేచురల్ బ్యూటీ

కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఒక వార్త.  నటుడు శింబు, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 49వ చిత్రం గురించి సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ లో మొదట పూజా హెగ్దేను హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. 

 అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ పాత్రలో నేచురల్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటించనుందట. సాయిపల్లవి చాలా కాలం తర్వాత మళ్లీ తమిళంలో నటించబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం హిందీలో 'ఏక్ దిన్', అలాగే 'రామాయణ 1', 2లో సీతగా నటిస్తోంది.  ఇప్పుడు మళ్లీ కోలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వడం పెద్ద సర్ ప్రైజ్ గా మారింది.

 వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్ కి, సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్ కి మంచి కాంబినేషన్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఒకవేళ నిజమైతే శింబు సాయిపల్లవి కాంబినేషన్ స్క్రీ్న్ పై మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.  ఈ ప్రాజెక్ట్ కోసం వెట్రిమారన్, శింబు కలిసి పనిచేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, వివిధ కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు వారి కలయిక నిజమవబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. శింబు ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంటారని, ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు అవుతుందని అంచనా వేస్తున్నారు.