
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(koratala shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఎన్టీఆర్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇక దేవర సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 16 సైఫ్ ఆలీ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా దేవర నుండి ఆయన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లాంగ్ హెయిర్ తో ఫుల్ మాసీగా ఉన్న ఈ లుక్ లో సైఫ్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. సైఫ్ ఈ సినిమాలో భైరా గా కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ లుక్ కూడా ఆడియన్స్ ను విపరీతాంగా ఆకట్టుకుంటోంది.
BHAIRA
— Jr NTR (@tarak9999) August 16, 2023
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2024 ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.