ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. బాబా సిద్దిఖీ హత్య కేసులో వాంటెడ్ క్రిమినల్ జీషన్ అక్తర్ పేరుతో ఆయన ఫోన్‌కు వాయిస్ మెసేజ్ వచ్చింది. బాబా సిద్దిఖీకి పట్టిన గతే నీకూ పడుతుందని అందులో హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై గురువారం ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, తుషార్ కపూర్ వంటి సినీ ప్రముఖులకు వరుస బెదిరింపుల నేపథ్యంలో సైఫ్‌కు మెసేజ్ రావడం కలకలం రేపింది. ఇది నిజంగానే అక్తర్ నుంచే వచ్చిందా, లేక ఏఐ సాంకేతికతతో ఎవరైనా వేధిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
