వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్తు చేసింది

వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్తు చేసింది

టోక్యో: కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న ఇండియా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైనా నెహ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఘన విజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైనా 21–19, 21–9తో  చెయుంగ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యి (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్తు చేసింది. 38 నిమిషాల్లోనే సైనా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగించింది.

రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ప్రత్యర్థి నజోమి ఒకుహరా (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టోర్నీ నుంచి విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా అయింది. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బై లభించడంతో సైనా నేరుగా ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. కాగా, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జోలీ జంట రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరింది. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ద్వయం 21–11, 21–13తో యీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–వలెరీ సియౌ (మలేసియా) జంటను ఓడించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అశ్విని భట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–శిఖా గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–8, 21–14తో కొర్సిని–జుడిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇటలీ) పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరింది.

కానీ, మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలుగు కుర్రాళ్లు కృష్ణప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–విష్ణువర్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జూహీ దేవాంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాట్నాగర్​–తనీషా క్రాస్టో  జంటలు తొలి రౌండ్​లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టాయి.