ఆరో తరగతి , ఇంటర్​ఫస్ట్​ ఇయర్​ ప్రవేశాలకు సైనిక్​ స్కూల్స్​​​ అడ్మిషన్స్​

ఆరో తరగతి , ఇంటర్​ఫస్ట్​ ఇయర్​ ప్రవేశాలకు సైనిక్​ స్కూల్స్​​​ అడ్మిషన్స్​

తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ సొసైటీ గురుకుల సైనిక్​ స్కూళ్లలో ఆరు, ఇంటర్​ఫస్ట్​ ఇయర్​ ప్రవేశాలకు అప్లికేషన్లు కోరుతోంది. సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ సైనిక్​ స్కూలు రుక్మాపూర్​(కరీంనగర్​), ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ సైనిక్​ స్కూలు అశోక్​నగర్​(వరంగల్​)​ రెండు చోట్ల గురుకుల సైనిక్ స్కూల్స్​ ఉన్నాయి.​ 

ఆరోతరగతి
సీట్లు: 80 
అర్హత: ఐదో తరగతి పూర్తి చేసిన బాలురు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు మించకూడదు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 
వయసు: 31  ఆగస్టు 2021 నాటికి 11 ఏండ్లు మించకూడదు. 
సెలెక్షన్​ ప్రాసెస్​: రిటెన్​ ఎగ్జామ్​​, ఫిజికల్ ఫిట్​నెస్​ టెస్ట్​, మెడికల్​ టెస్ట్​
ఎగ్జామ్​ ప్యాటర్న్​
సబ్జెక్ట్​    మార్కులు
ఇంగ్లిష్​     20
మ్యాథ్స్​    40
ఫిజిక్స్​      20
కెమిస్ట్రీ       15
బయాలజీ   05
మొత్తం    100

ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​:
సీట్లు: 80 
అర్హత: టెన్త్​ పాసైన స్టూడెంట్స్ అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామాల్లో 1.50 లక్షలు మించకూడదు. ఫిజికల్​ మెజర్​మెంట్స్​ ఉండాలి.
వయసు: 31 ఆగస్టు 2021 నాటికి 16 ఏండ్లు మించకూడదు.
సెలెక్షన్​ ప్రాసెస్​: రిటెన్​ ఎగ్జామ్​​, ఫిజికల్ ఫిట్​నెస్​ టెస్ట్​, మెడికల్​ టెస్ట్​

ఎగ్జామ్​ ప్యాటర్న్​
సబ్జెక్ట్​    మార్కులు
తెలుగు    20
ఇంగ్లిష్​    20
మ్యాథ్స్​    20
సైన్స్​        20
సోషల్​స్టడీస్​    20
మొత్తం    100

ముఖ్యసమాచారం
దరఖాస్తులు: ఆన్​లైన్​
చివరితేది: 7 ఏప్రిల్​ 2021
అప్లికేషన్​ ఫీజు: రూ.100
రిటెన్​ ఎగ్జామ్​: ఏప్రిల్​ 30
వెబ్​సైట్​: www.tswreis.in