రణ్ బీర్ కపూర్ మూవీలో సాయిపల్లవి.?

రణ్ బీర్ కపూర్ మూవీలో సాయిపల్లవి.?

టాలీవుడ్‌‌లో స్టార్ హీరోయిన్స్‌‌  ఎందరున్నప్పటికీ సాయిపల్లవికి ఉన్న క్రేజ్ వేరు. యూత్‌‌తో పాటు ఫ్యామిలీస్‌‌ ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్‌ ను ఎంచుకుంటూ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. సౌత్‌‌లో మెప్పించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌‌కు వెళ్లబోతోందట. అదికూడా ఓ పౌరాణిక చిత్రంతో కావడం విశేషం. రణబీర్‌‌ కపూర్‌‌ హీరోగా రామాయణం ఆధారంగా బాలీవుడ్‌‌లో ఓ సినిమా రూపొందబోతోంది.

ఇందులో రాముడిగా రణబీర్ నటిస్తుండగా.. రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషించనున్నాడు. మధు మంతెన నిర్మించే ఈ చిత్రం వచ్చే యేడాది సెప్టెంబర్‌‌‌‌లో షూటింగ్ మొదలవనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో సీత పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పాత్రకు గతంలో దీపిక పదుకొణె, కరీనా కపూర్‌‌‌‌ పేర్లు వినిపించాయి. ఇప్పుడేమో సాయిపల్లవిని ఫైనల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పెర్‌‌‌‌ఫార్మెన్స్‌‌కు స్కోప్ ఉండే క్యారెక్టర్ కావడంతో ఆమె ఈ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నారట మేకర్స్. మరి సెలెక్టివ్‌‌గా సినిమాలకు సైన్ చేసే సాయిపల్లవి.. ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!