
దివంగత ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. సైరా భానుకు హర్ట్ స్టోక్ వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులు హిందూజా ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సైరా భాను భర్త, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇటీవలే చనిపోయారు. 98 ఏళ్ల వయస్సు ఉన్న నటుడు దిలీప్ కుమార్ అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది జూలై 7న కన్నుమూశారు. ఇప్పుడు సైరా భాను కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.