టాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనున్న సైరాత్ భామ రింకూ రాజ్​గురు

టాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనున్న సైరాత్ భామ రింకూ రాజ్​గురు

మరాఠీలో 2016లో విడుదలైన ‘సైరత్(Sairat)’​ సినిమా బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి అన్ని పరిశ్రమల దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది. ఇందులో నటించిన హీరోయిన్​ రింకూ రాజ్​గురు(Rinku rajguru)కు అవార్డులతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆర్చీగా అద్భుతంగా నటించింది. ఈ మూవీ తర్వాత పదో తరగతి పరీక్షలు ఉండటంతో చదువుపై ఫోకస్​​ పెట్టి ఇండస్ట్రీకి దూరమైంది.

Also Read :- మెగా ఇంటి కోడలిగా కృతిశెట్టి?

ఇప్పుడు రింకూ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా టాలీవుడ్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్​ హీరో విశ్వక్​ సేన్​ తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’ దర్శకుడు యాకుబ్​ అలీ ఓ సినిమాను ప్లాన్​ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా రింకూను సెలక్ట్​ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రావలసి ఉంది.