
ఏపీలో లిక్కర్ స్కాం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. శనివారం ( జులై 19 ) వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వార్ మరింత ముదిరింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి అరెస్ట్ పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని.. ఇప్పుడు లిక్కర్ స్కాం అంతా ఉహాజనితమేనని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని అన్నారు సజ్జల.
చంద్రబాబు హయాంలో రూ. 40 వేలకు పైగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారించారని అన్నారు సజ్జల. టీడీపీ నేతలే సిండికేట్ గా ఏర్పడి.. మద్యం షాపులు నడుపుతున్నారని అన్నారు. మద్యం కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని అన్నారు సజ్జల. లిక్కర్ స్కాం కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు పోలీసులు.ఆదివారం ( జులై 20 ) మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి శనివారం సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డిని 6 గంటల విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఓసారి నోటీసులిచ్చి మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ ఇవాళ రెండోసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది. మిథున్ రెడ్డికి సంబంధించి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంది. మిథున్ రెడ్డిని ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.