
ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) నటించిన గాంఢీవధారి అర్జున( Gandeevadhari Arjuna) మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ఇది ఈ బ్యూటీకి రెండో సినిమా. ఇప్పటికే ఏజెంట్ డిజాస్టర్గా మారడంతో సాక్షి గ్లామర్ వృథా అయ్యింది.
ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఈ భామ జోడీ కట్టింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. దీంతో సాక్షికి ఈ మెగా హీరో కూడా హ్యాండిచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల లీడ్ రోల్ చేస్తుండగా.. సాక్షి మరో హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇక సాయిధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమాలైనా ఈ నటిని గట్టెక్కిస్తాయా? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.