
రీసెంట్‌గా ‘ఆదిపురుష్’ చిత్రంలో శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్.. మరో వంద రోజుల్లో తనదైన యాక్షన్ లుక్‌లో మెరవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘సాలార్’ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ డేట్‌కి సరిగ్గా వందరోజులు మాత్రమే ఉందని గుర్తు చేసిన టీమ్.. ‘ప్రపంచానికి అవసరమైన సీపీఆర్‌ని అందించడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 28న రాబోతున్న ‘సాలార్’ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఈ మూవీ టీజర్‌ను జులై మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.