బిట్​ బ్యాంక్​..సాలార్​జంగ్​ సంస్కరణలు

 బిట్​ బ్యాంక్​..సాలార్​జంగ్​ సంస్కరణలు
  •     1853లో మొదటి సాలార్​జంగ్​ హైదరాబాద్​ రాజ్య ప్రధానిగా నియమితుడయ్యే నాటికి రాజ్యం అన్ని రంగాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రోజుల తరబడి బకాయిల్లో కూరుకుపోయి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉందని హైదరాబాద్​ ఆర్థిక మంత్రి సర్​ అక్బర్​ హైదరి 1921లో రాశారు. 
  •     1853, మే 31న నిజాం రాజ్య దివాన్​ లేదా ప్రధాన మంత్రిగా నియమితుడయ్యే నాటికి సాలార్​జంగ్​ వయస్సు 24 ఏళ్లు. 
  •     హైదరాబాద్​ రాజ్య ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సాలార్​జంగ్​ ఎంచుకున్న ఆరు అంశాల్లో  మొదటిది1855లో జీతంపై పనిచేసే తాలుకాదార్లను లేదా కలెక్టర్లను నియమించడం, కాంట్రాక్ట్​ తాలుకాదార్లను తొలగించడం. 
  •     హైదరాబాద్​ రాజ్య ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సాలార్​జంగ్​ చేపట్టిన మొదటి సంస్కరణల్లో రెండో అంశం తక్కువ వడ్డీరేటుకు రుణ సౌకర్యం కల్పించి, ఎక్కువ వడ్డీరేటుపై తాకట్టు పెట్టిన ప్రభుత్వ భూములను విడిపించడం, రుణాలను తీర్చడం.
  •     సాలార్​జంగ్​ చేపట్టిన మొదటి సంస్కరణల్లో మూడో అంశం ప్రభుత్వ హాలిసిక్కా రూపాయిని ప్రవేశపెట్టడం. హైదరాబాద్​ కేంద్రంగా ప్రభుత్వ ముద్రణా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రైవేటు ముద్రణా కార్యాలయాలను మూసివేయించడం. 
  •     సాలార్​జంగ్​ మొదటి సంస్కరణల్లోని నాలుగో అంశం అకౌంటింగ్​ జనరల్​ ఆఫీసును ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆదాయ, వ్యయాల లెక్కలు తయారు చేయించడం. 
  •     సాలార్​జంగ్​ మొదటి సంస్కరణల్లో ఐదో అంశం పలు కాంట్రాక్టర్ల కింద ఉన్న భూములన్నింటిని తొలగించి, వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి రప్పించి  ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం. 
  •     సాలార్​జంగ్​ మొదటి సంస్కరణల్లో ఆరో అంశం గ్రామం యూనిట్​గా పన్ను చెల్లించే పద్ధతిని రద్దు చేసి, రైతు స్వతంత్రంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించే పద్ధతిని పెట్టడం. 
  •     సాలార్​జంగ్​ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాన్ని బొంబాయి రైత్వారీ పద్ధతి రెవెన్యూ విధానం అని పిలిచేవారు. 
  •     సాలార్​జంగ్​ రెండోసారి సంస్కరణలు వర్తక, వాణిజ్యాలపై చేపట్టారు.
  •     రహదారి పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక కస్టమ్స్​ అధికారులను నియమించింది సాలార్​జంగ్​.
  •     సాలార్​జంగ్​ మూడో సంస్కరణ ప్రభుత్వాధీనంలో పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేసి, తద్వారా రోడ్ల పునరుద్ధరణ, నీటిపారుదల పనులు చేపట్టి వ్యవసాయాభివృద్ధికి కృషి చేయడం.
  •     ప్రభుత్వపరమైన అటవీశాఖను ఏర్పాటు చేసి, అటవీ సంపదను ప్రభుత్వపరం చేసిన నిజాం ప్రధాన మంత్రి సాలార్​జంగ్​.
  •     రాజ్యంలో శాంతిభద్రతలను మెరుగుపరచడం కోసం హైదరాబాద్​లో సాలార్​జంగ్​ ఏర్పాటు చేసిన పోలీస్​ శాఖ మహాకామా ఇ కొత్వాల్​. 
  •     సాలార్​జంగ్​ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పోలీసు శాఖలను చౌకీసు అనేవారు. 
  •     సాలార్​జంగ్​ ఏర్పాటు చేసిన పోలీసుదళం పేరు నిజామత్​.
  •     జిల్లా పోలీసు అధికారిగా నియామకమైన సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీసును ముత్తామీన్​ అని పిలిచేవారు.
  •     సాలార్​జంగ్​ హైదరాబాద్​ కేంద్రంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానం హైకోర్టు. 
  •     సాలార్​జంగ్​ జిల్లాల్లో నియమించిన న్యాయాధికారులు మునిసిఫ్​, ఆదిల్స్​.
  •     సాలార్​జంగ్​ మొత్తం రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజిస్తూ జిలాబంది వ్యవస్థను 1865లో ప్రవేశపెట్టారు. 
  •     సాలార్​జంగ్​ తన సంస్కరణల్లో భాగంగా 1868లో మొత్తం ప్రభుత్వ పరిపాలనను నాలుగు మంత్రిత్వశాఖలకు కిందకి తెస్తూ ఏర్పాటు చేసిన మంత్రి మండలిని సదర్​ ఉల్​ మహమ్​ అని పిలిచేవారు. 
  •     సదర్​ ఉల్​ మహమ్ శాఖ​ దివాన్​ లేదా ప్రధాన మంత్రికి బాధ్యత వహించేది. 
  •     సాలార్​జంగ్​ దారుల్​ ఉల్​ ఉలూమ్​ అనే హైస్కూల్​ను ఏర్పాటు చేసి ఇంగ్లీష్​ను ఒక నిర్బంధ సబ్జెక్టుగా 1855లో ఏర్పాటు చేశారు. 
  •     1870లో ​ స్కూల్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ను ఏర్పాటు చేశారు. 
  •     నీటిపారుదలపై ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​, ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ప్రత్యేక శ్రద్ధ వహించారు. 
  •     నవాబ్​ అలీ నవాజ్ జంగ్​ను నిజాం రాజ్య ప్రధాన ఇంజినీరుగా ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ నియమించారు. 
  •     ప్రస్తుతం నెహ్రూ జూపార్క్​కు నీటిని అందిస్తున్న మీర్ ఆలం ట్యాంక్​ను 1810లో మూడో నిజాం సికిందర్​ జా ప్రధాన మంత్రి మీర్​ ఆలం నిర్మించాడు. 
  •     1905లో మెదక్​ జిల్లా ఘన్​పూర్​ దగ్గరలో మంజీరా నదిపై ఆనకట్ట నిర్మించారు. 
  •     నల్లగొండ జిల్లాలోని నెమలికాల్వ గ్రామం వద్ద 1905లో మూసీ నదిపై నిర్మించిన ఆనకట్ట అసఫ్​నహర్​ ప్రాజెక్టు. 
  •     1908లో మూసీ నది వరదల వల్ల జరిగిన ప్రాణనష్టం, ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ నది నీటిని హైదరాబాద్​ పట్టణవాసుల తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1919లో తన పేరిట నిర్మించిన ప్రాజెక్ట్​ ఉస్మాన్​సాగర్​ (దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు).
  •     మూసీ ఉపనది ఈసాపై తన కుమారుడు హిమాయత్​ అలీఖాన్​ పేరున 1927లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నిర్మించిన ప్రాజెక్టు హిమాయత్​ సాగర్​. 
  •     బెలాల్​ ప్రాజెక్టును నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ తాలుకాలో నిర్మించారు. 
  •     1922లో పోచారం రిజర్వాయర్​ను నిజామాబాద్​ జిల్లాలోని పోచారం గ్రామం వద్ద ఆలేరు అనే ఉపనదిపై నిర్మించారు. 
  •     మెదక్​ జిల్లా రాయంపల్లిలో 1924లో రాయంపల్లి అనే రిజర్వాయర్​ను రూ.3 లక్షలతో నిర్మించారు. 
  •     ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నిర్మించిన ప్రాజెక్టుల్లో అతి పెద్దది నిజాం సాగర్​ ప్రాజెక్ట్​.
  •      నిజాంసాగర్​ ప్రాజెక్టును మంజీరా నదిపై నిర్మించారు.
  •     నిజాంసాగర్​ ప్రాజెక్టును నిజామాబాద్​ జిల్లా అచ్చంపేట గ్రామ సమీపంలో నిర్మించారు. 
  •      నిజాంసాగర్​ ప్రాజెక్టు నిర్మాణం కాలం 1924–1931.
  •     ఖమ్మం జిల్లా పాలేరు నదిపై నాయికుండ గ్రామంలో 1924–29లో  నిర్మించిన ప్రాజెక్ట్​ పాలేరు.
  •     వైరా ప్రాజెక్ట్​ను ఖమ్మం జిల్లాలోని మధిర తాలుకాలో వైరా నది మీద నిర్మించారు. 
  •     సింగభూపాలం రిజర్వాయర్​ను ఖమ్మం జిల్లాలోని మధిర తాలుకాలోని వైరా నది మీద నిర్మించారు. 
  •     1943లో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలుకాలో కృష్ణా నది ఉప నది అయిన డిండిపై డిండి ప్రాజెక్టును నిర్మించారు.