ఎల్ఐసీలో మైనారిటీ వాటా అమ్మకం

ఎల్ఐసీలో మైనారిటీ వాటా అమ్మకం

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, లావాదేవీల వివరాలను డిజిన్వెస్ట్‌‌‌‌మెంట్ విభాగం ఖరారు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. మే 2022లో  ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా 3.5 శాతం వాటాను విక్రయించింది. 

ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 21 వేల కోట్లు వచ్చాయి.  ఓఎఫ్‌‌‌‌ఎస్ మార్గం ద్వారా ఎల్ఐసీలో మరిన్ని షేర్ల విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.   2027, మే 16 నాటికి 10 శాతం పబ్లిక్ షేర్‌‌‌‌హోల్డింగ్ అవసరాన్ని తీర్చడానికి ప్రభుత్వం ఎల్​ఐసీలో తప్పనిసరిగా మరో 6.5 శాతం వాటాను విక్రయించాలి. 

వాటా విక్రయం పరిమాణం, ధర,  సమయం తగిన సమయంలో నిర్ణయిస్తామని సీనియర్​అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఐసీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.85 లక్షల కోట్లు.