ప్రభాసా.. మాజాకా.. గంటలో లక్ష సలార్ టికెట్లు అమ్మకం

ప్రభాసా.. మాజాకా.. గంటలో లక్ష సలార్ టికెట్లు అమ్మకం

సలార్.. సలార్.. ప్రభాస్ మూవీ మానియా నడుస్తుంది.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. హిందీలో అదరగొడుతుంది. మూవీ రిలీజ్ రోజు అయిన.. డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం.. 8 గంటల నుంచి 9 గంటల మధ్య.. హిందీ వెర్షన్ కు సంబంధించి.. బుక్ మై షో ద్వారా మాత్రమే.. అక్షరాల 51 వేల 570 టికెట్లు అమ్ముడుపోయాయి.. ఇది హిందీ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ అంటున్నారు. అది కూడా ఆన్ లైన్ లో కావటం.. మూవీ రిలీజ్ అయిన తర్వాత.. టాక్ బయటకు వచ్చిన తర్వాత.. ఒకే ఒక్క గంటలో.. 51 వేల టికెట్లు అమ్ముడుపోవటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

60 అంటే 60 నిమిషాల్లో.. 51 వేల టికెట్లు అంటే.. నిమిషానికి 850 మంది సినీ అభిమానులు.. ఆన్ లైన్ ద్వారానే సలార్ మూవీ టికెట్లు కొనుగోలు చేయటం విశేషం.. ఈ టికెట్ల అమ్మకం బుక్ మై షో ద్వారా జరిగింది. అదే విధంగా మల్టీఫ్లెక్స్ ధియేటర్లకు సంబంధించి పీవీఆర్.. ఐనాక్స్, ఇతర వెబ్ సైట్లు, యాప్స్ నుంచి కొనుగోలు చేసిన టికెట్లు మరో 50 వేలు ఉంటాయని.. ఒకే ఒక్క గంటలో.. ఆన్ లైన్ ద్వారా.. హిందీ వెర్షన్ కు లక్ష టికెట్లు అమ్మకం జరగటం రికార్డ్ అంటున్నారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం ఒక గంటలోనే.. సలార్ హిందీ వెర్షన్ టికెట్లు.. నిమిషానికి 17 వందల వరకు అమ్ముడుపోవటం విశేషం.

సలార్ మూవీ ధియేటర్లలో సందడి చేస్తున్న సమయంలోనే.. రెండు ఆటలు కంప్లీట్ అయిన తర్వాత.. ప్రభాస్ సలార్ మూవీ హిందీ వెర్షన్ కు డిమాండ్ అనూహ్యంగా పెరగటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొన్నటికి మొన్న ఆదిపురుష్ అయితే ఫస్ట్ షో తర్వాత టికెట్ల అమ్మకం దారుణంగా పడిపోయింది.. వేల సంఖ్యలో ఉంది.. అందుకు భిన్నంగా సలార్ మూవీ హిందీ వెర్షన్ కు.. గంటలోనే లక్ష టికెట్ల అమ్మకం జరగటం అనేది మూవీపై అంచనాలను.. ప్రేక్షకుల ఇంట్రస్ట్ ఏంటో స్పష్టం చేస్తుంది. క్రిస్మస్ హాలిడేస్ కంటిన్యూ ఉన్నాయి.. కలెక్షన్స్ భారీగానే ఉండొచ్చని.. మరిన్ని లక్షల టికెట్ల అమ్మకం ఖాయం అని అంచనా వేస్తున్నారు నిర్మాతలు.