
న్యూఢిల్లీ : లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగడంతో ఈ పండుగ సీజన్‌లో మెర్సిడెజ్ బెంజ్, ఆడి రికార్డ్ లెవెల్లో అమ్మకాలు జరిపాయి. ఈ ఏడాది మొదటి నుంచి లగ్జరీ కార్లకు డిమాండ్ కొనసాగుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కంపెనీలు రికార్డ్ లెవెల్ సేల్స్ నమోదు చేస్తున్నాయని చెప్పారు. కిందటేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగా జరిగాయని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. ‘దసరా, ధన్‌తేరాస్, దీపావళి టైమ్‌లో రికార్డ్ లెవెల్‌లో కార్లను డెలివరీ చేశాం. డిమాండ్ కొనసాగుతోంది.
ఈ ఏడాది రికార్డ్ లెవెల్ అమ్మకాలు జరుపుతాం. కానీ, సప్లయ్ చెయిన్ సమస్యలు ఉండడంతో ప్రొడక్షన్ తగ్గింది’ అని వెల్లడించారు. ముఖ్యంగా ఎస్‌యూవీలు, జీఎల్‌సీ మోడల్ కార్లు డిమాండ్‌కు తగ్గట్టు అందుబాటులో లేవని చెప్పారు. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్‌లో 5,530 కార్లు అమ్మామని, ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 88 శాతం గ్రోత్ నమోదు చేశామని చెప్పారు. ‘మా ఆర్డర్ బుక్ పెరుగుతోంది. గత ఏడేళ్లలో హయ్యెస్ట్ ఫెస్టివల్ సేల్స్ జరిగాయి’ అని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబైలో తమ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉందని ధిల్లన్ అన్నారు.