
హైదరాబాద్, వెలుగు: సిటీలోని తన సెంటర్ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను సీఆర్ఎం కంపెనీ సేల్స్‌ఫోర్స్ భారీగా విస్తరిస్తోంది. ఈ సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్లో అదనంగా 4,500 సీట్ల కెపాసిటీని కంపెనీ యాడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ వెల్లడించారు. సేల్స్‌ఫోర్స్ గత పదేళ్లుగా ఇండియాలో పెట్టుబడులు పెడుతోంది. హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్లలో కలిపి ఈ కంపెనీకి మొత్తం 9 వేల మంది ఉద్యోగులున్నారు.
తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని సేల్స్‌ఫోర్స్ వెల్లడించింది. ఇటీవల తెచ్చిన కొత్త ప్రొడక్టులలో ఈ సెంటర్ ఇంజినీరింగ్ టీములకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 6.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
ఏర్పాటు చేశారు.