ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా హాకీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు ఇదే

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా హాకీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు  ఇదే

న్యూఢిల్లీ: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా హాకీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టును గురువారం ప్రకటించారు. మిడ్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్‌‌‌‌‌‌‌‌ సలీమా టెటే మరోసారి కెప్టెన్సీ నిలబెట్టుకుంది. మొత్తం 20 మందిని ఈ మెగా టోర్నీకి ఎంపిక చేశారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు చైనాలోని హాంగ్జౌలో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో విజేతగా నిలిచిన జట్టుకు 2026 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఎంట్రీ లభించనుంది. దాంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన జట్టును ఎంపిక చేశామని చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ హరేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. పూల్‌‌‌‌‌‌‌‌–బిలో ఉన్న ఇండియా.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 5న థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌తో, 6న జపాన్‌‌‌‌‌‌‌‌తో, 8న సింగపూర్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. 

ఇండియా జట్టు

గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్స్‌‌‌‌‌‌‌‌: బన్సారీ సోలంకి, బిచు దేవి కరీబామ్‌‌‌‌‌‌‌‌, డిఫెండర్స్‌‌‌‌‌‌‌‌: మనీషా చౌహాన్‌‌‌‌‌‌‌‌, ఉదిత, జ్యోతి, సుమన్‌‌‌‌‌‌‌‌ దేవి తౌడమ్‌‌‌‌‌‌‌‌, నిక్కీ ప్రధాన్‌‌‌‌‌‌‌‌, ఇషికా చౌదరీ, మిడ్‌‌‌‌‌‌‌‌ఫీల్డర్స్‌‌‌‌‌‌‌‌: నేహా, వైష్ణవి విఠల్‌‌‌‌‌‌‌‌ పాల్కే, సలీమా టెటే (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), శర్మీలా దేవి, లాల్‌‌‌‌‌‌‌‌రెమిసియామి, సునెలిటా టోపో, ఫార్వర్డ్స్‌‌‌‌‌‌‌‌: నవ్నీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, రుతుజా డాడసో పిసల్‌‌‌‌‌‌‌‌, బ్యూటీ డుంగ్‌‌‌‌‌‌‌‌డుంగ్‌‌‌‌‌‌‌‌, ముంతాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, దీపిక, సంగీతా కుమారి.