రామ్ చరణ్ ఇంట్లో సల్మాన్, వెంకీ సందడి

రామ్ చరణ్ ఇంట్లో సల్మాన్, వెంకీ సందడి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌‌లో స్నేహితులను కలుస్తూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి, వెంకటేష్‌‌లతో సరదాగా సల్లూ భాయ్ ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లెటెస్ట్‌‌గా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇంట్లో సల్మాన్ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే, రామ్ చరణ్ సతీమణి ఉపాసలు కూడా ఉన్నారు. వీరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు సల్మాన్ వచ్చిన సంగతి తెలిసిందే.

సమయం దొరికినప్పుడల్లా తన క్లోజ్ ఫ్రెండ్స్ ను కలుస్తూ.. వారితో ముచ్చటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో ‘సల్మాన్’ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో ‘వెంకటేశ్’ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే ‘కమల్ హాసన్’ నటించిన ‘విక్రమ్’ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో కమల్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ సెలబ్రెటీలతో సల్లూ చేస్తున్న హంగామా చూసిన ఆయన అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.