‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జంటగా చిత్రాంగద సింగ్‌

‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జంటగా చిత్రాంగద సింగ్‌

స‌‌‌‌‌‌‌‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌‌‌‌‌‌‌‌టిస్తున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. యాక్షన్‌‌‌‌‌‌‌‌ మూవీస్‌‌‌‌‌‌‌‌కు కేరాఫ్​ అయిన అపూర్వ లఖియా దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా టైటిల్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. తాజాగా ఇందులో నటించబోయే హీరోయిన్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. సల్మాన్ ఖాన్‌‌‌‌‌‌‌‌కు జంటగా చిత్రాంగద సింగ్‌‌‌‌‌‌‌‌ నటించబోతోంది.  దర్శకుడు అపూర్వ లఖియా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘బాబ్ బిశ్వాస్‌‌‌‌‌‌‌‌’ లాంటి చిత్రాల్లో ఆమె నటన చూసి ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు.

సల్మాన్, చిత్రాంగద కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వస్తున్న తొలి సినిమా ఇదే కానుంది.  2020లో చైనా ఆర్మీతో గల్వాన్ వ్యాలీలో జరిగిన యుద్ధంలో భారత జవాన్లు చూపిన ధైర్యసాహసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌‌‌‌‌‌‌‌లెస్ 3’ అనే బుక్ ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.