
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) బాడీగార్డ్ షేరా (Shera) రూ.1.4 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. షేరా తన రేంజ్ ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. 29 సంవత్సరాలుగా సల్మాన్ బాడీగార్డ్‌గా ఉన్న షేరా..అతని కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ పక్కన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ | నటులు ముఖేష్, జయసూర్య లపై లైంగిక వేధింపుల కేసు నమోదు
సల్మాన్ బాడీగార్డుగా ఉన్నందుకు షేరా నెలకు రూ.15 లక్షల జీతం అందుకుంటున్నాడు. అంటే ఏడాదికి ఏకంగా రూ.2 కోట్లు అందుకోవడం విశేషం. షేరా సంపద విలువ సుమారు రూ.100 కోట్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు.
బాడీగార్డ్ షేరా గురించి:
షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్. ముంబైలోని అంధేరి (మనీష్ నగర్)లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. బాలీవుడ్ ప్రపంచంలోకి అంటే సల్మాన్ జీవితంలోకి ప్రవేశించడానికి ముందు..షేరా తన బాడీబిల్డింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. మిస్టర్ ముంబైతో సహా అనేక పోటీలలో గెలిచాడు.అంతేకాకుండా మిస్టర్ మహారాష్ట్ర పోటీలో రెండవ స్థానంలో నిలిచాడు.