అలా చేస్తే టైగర్ 3కి భారీ లాస్.. వద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్న సల్మాన్ ఫ్యాన్స్

అలా చేస్తే టైగర్ 3కి భారీ లాస్.. వద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్న సల్మాన్ ఫ్యాన్స్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3). టైగర్(Tiger) సిరీస్ లో మూడో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్(Katrina kaif) హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు మనీష్ శర్మ(Maneesh sharma) తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీపై  అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల రిలీజ్ చేసిన టైగర్3 టీజర్ కు ఆడియన్స్ నుండి అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎప్పుడప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు టైగర్ 3 రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.  

Also Read : బిగ్ బాస్లో మొబైల్ ఫోన్స్.. ఇకనుండి కొత్త రూల్స్, కొత్త గేమ్స్

అయితే తాజా సమాచారం ప్రకారం టైగర్ 3 రిలీజ్ డేట్ పై మేకర్స్ డైలమాలో ఉన్నారట. ముందుగా ఈ సినిమాను నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మేరకు టైగర్ 3 రిలీజ్ నవంబర్ 12కు మారిందట. దీపావళి పండుగరోజును పురస్కరించుకొని ఆరోజు సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. 

కానీ మేకర్స్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు సల్మాన్ ఫ్యాన్స్. కారణం.. దీపావళి రోజు సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ థియేటర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందరు పండుగ వాతావరణంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. థియేటర్స్ కు రారు. అది టైగర్ 3 మొదటిరోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల సినిమాకు భారీ నష్టం రావడం ఖాయం. గతంలో హౌస్ ఫుల్4, క్రిష్ 3 సినిమాలకు కూడా ఇలాగే జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిది మేకర్స్ కు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సల్మాన్ ఫ్యాన్స్. మరి సల్మాన్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ రిక్వెస్ట్ పై టైగర్ 3 మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.