డయాబెటిస్.. ఉప్పుతోనూ వస్తుంది

డయాబెటిస్.. ఉప్పుతోనూ వస్తుంది

స్వీట్ పదార్ధాలు  ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుందని అందరూ అనుకుంటారు. అయితే తీపి పదార్ధాలు తింటేనే కాదు… ఉప్పు అధికంగా తిన్నా షుగర్ వస్తుందట. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన రీసెర్చ్ లో ఈ విషయం తేలింది.

ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తేల్చిచెప్పారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని… ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందన్నారు.

అంతేకాదు ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడంతో రక్తపోటుకు గురికావడంతో పాటు బరువు కూడా పెరగుతారని, డయాబెటిస్ కు ఇవి రెండూ ప్రమాదమేనన్నారు. రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.