చత్తీస్‌‌గఢ్‌‌ సమాజ్ వాదీ నాయకుడి హత్య

చత్తీస్‌‌గఢ్‌‌ సమాజ్ వాదీ నాయకుడి హత్య

బీజాపూర్‌‌ మావోయిస్టులు దుశ్చర్య

భద్రాచలం, వెలుగు: చత్తీస్‍గఢ్‌‌ సమాజ్‌‌వాది పార్టీ ఉపాధ్యక్షుడు సంతోష్‌‌ పూనెంను మావోయిస్టులు కిడ్నాప్‌‌ చేసి దారుణంగా హత్య చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజాపూర్‌‌ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాంట్రాక్టర్‌‌ కూడా అయిన పూనెం మావోయిస్టుల హిట్‌‌లిస్ట్‌‌లో ఉన్నారు. బీజాపూర్‍జిల్లాలోని ఇల్‍మిడీ పోలీస్ స్టేషన్‍ పరిధిలో మారెమళ్ల గ్రామానికి చెందిన సంతోష్‍పూనెం ప్రధానమంత్రి గ్రామీణ సడక్‍యోజన పథకంలో భాగంగా లోథేడ్‍- మారెమళ్ల గ్రామాల మధ్య రహదారి నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు ఆపాలని కొంతకాలంగా మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. పనులు పరిశీలించేందుకు వెళ్లిన పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్‌‌ చేశారు. పనులు జరుగుతున్న చోట డోజర్‍, జేసీబీ, ట్రాక్టర్‍, బొలేరో వాహనాలకు నిప్పు పెట్టి ఆయన్ను కాల్చి చంపారు. మృతదేహం తీసుకెళ్లేందుకు వెళ్లిన సంతోష్‌‌ భార్య, సోదరుడిని మావోయిస్టులు వెనక్కు పంపించేశారు.

ఇద్దరు సహచరులను కాల్చిచంపిన జవాన్‍

భద్రాచలం, వెలుగు: చత్తీస్‍గఢ్‌ ఆర్మ్‌‌డ్‌‌ ఫోర్స్‌‌ సిబ్బంది మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఓ జవాన్‌‌ ఇద్దరు సహచరులను కాల్చి చపేందుకు కారణమైంది. బీజాపూర్ జిల్లా నైమేడ్‌‌ పోలీస్‌ స్టేష న్ పరిధిలో నక్సల్స్ ఏరివేతకు చత్తీస్‍గఢ్‌ ఆర్మ్‌‌డ్‌‌ ఫోర్స్‌‌ వచ్చింది. సంజయ్ నిషాద్‍అనే జవాన్‌‌ తోటి జవాన్లు సంజయ్ కుమార్‌ భాస్కర్‍, సురేంద్రకుమార్‌ సాహూలతోఘర్షణకు దిగాడు. వారు బస చేసి న బ్యారక్ లోతన వద్ద ఉన్న ఇన్సాస్‌ ఎల్ఎంజీ ఆయుధంతో ఏడు రౌండ్ లు కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. వెంటనే కాల్పులు జరిపిన సంజయ్‌‌ను అరెస్ట్ చేశారు.బీజాపూర్‍ ఎస్పీ దివ్యాం గ్ పటేల్ నైమేడ్‍కు చేరుకుని దీనిపై విచారణ నిర్వహిస్తు న్నారు.

నకిలీ నక్సలైట్​ అరెస్ట్

పెద్దపల్లిటౌన్​, వెలుగు: బెదిరింపు లేఖలు రాస్తూ డబ్బలు వసూలు చేస్తున్న నకిలీ నక్సలైట్‌‌ను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పోలీసు స్టేషన్​లో  బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్​ గ్రామానికి చెందిన కలవేన రాజమల్లు కొంత కాలంగా జనశక్తి, పీపుల్స్​వార్ లెటర్​ప్యాడ్లతో బెదిరింపు లేఖలు రాస్తూ డబ్బు వసూలు చేస్తున్నాడని పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన పెండం సదానందం, దొమకుంట శ్రీనివాస్‌‌కు బెదిరింపు లేఖలు పంపించాడన్నారు. సదానందం నిందితుడు పెట్టమన్న చోట డబ్బు పెట్టి వచ్చాడన్నారు. సదానందంకు మార్చి 26న మళ్లీ లేఖ రావడంతో ఈనెల 14న పోలీసులన ఆశ్రయించారన్నారు. విచారణలో రాజమల్లు నిందితుడుగా తేలడంతో బుధవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.