సెన్సార్ బోర్డు మెంబర్ గా సామల వేణు

సెన్సార్ బోర్డు మెంబర్ గా సామల వేణు

హైదరాబాద్, వెలుగు: సెన్సార్ బోర్డు అడ్వయిజరీ ప్యానల్ మెంబర్ గా అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సామల వేణు రెండేండ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. గతంలో రెండుసార్లు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆయన జ్యూరీ మెంబర్ గా వ్యవహరించారు. 

42 ఏండ్లుగా 34కు పైగా దేశాల్లో 7 వేల కంటే ఎక్కువ మ్యాజిక్​షోలను నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు  విదేశాల్లో సైతం భారత దేశ సంస్కృతిని బలోపేతం చేయటానికి సామల వేణు ఎంతో కృషి చేశారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్రం సెన్సార్ బోర్డు అడ్వయిజరీ మెంబర్ గా నియమించింది.