
సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తన సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా అందులో పనిచేయాలనుకుంటే ఇలా చేయండి అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్స్.. సమంత సంస్థలో వర్క్ చేయాలంటే ఎం చేయాలో అంటూ సెర్చింగ్ మొదలుపెట్టేశారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సమంత ఇటీవల సాకి పేరుతో ఒక దుస్తుల బ్రాండ్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుండి వచ్చిన దుస్తులకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో.. ఈ బ్రాండ్ లో పనిచేసేందుకు ఎంప్లాయిస్ కావాలని ప్రకటన చేసింది సామ్. తన సంస్థలో.. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ వంటి పోస్టుల్లో ఉద్యోగాలు ఉన్నాయని, వాటికి తగ్గ అర్హత కలిగినవారు అప్లయ్ చేసుకోవచ్చని ఓ మెయిల్ ఐడీను కూడా షేర్ చేసింది. దీంతో.. చాలా మంది సామ్ సంస్థలో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ మెయిల్స్ చేస్తున్నారు.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హనీ బన్నీ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. హాలీవుడ్ సిటాడెల్ కు రీమేక్ గా వస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సిరీస్ తోపాటు మా ఇంటి బంగారం అనే సినిమా కూడా చేస్తున్నారు సమంత. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.