టామీ హిల్ఫిగర్ బ్రాండ్ అంబాసిడర్గా సమంత

టామీ హిల్ఫిగర్ బ్రాండ్ అంబాసిడర్గా సమంత

టామీ హిల్ ఫిగర్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ఇకనుంచి టామీ హిల్ ఫిగర్ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా.. ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత కనిపిస్తారు.

అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కు మాత్రమే నటించే అవకాశం వచ్చింది. అయితే, తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం రావడం విశేషం. టామీ రాబోతోన్న విమెన్ కలెక్షన్ వాచ్ ల్లో ఈసారి వెరైటీస్ కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

టామీ నుంచి వస్తున్న విమెన్స్ వాచ్ ల్లో స్టీల్, గోల్డ్ ప్లేట్, లెదర్ స్టైల్స్ లో రాబోతున్నాయి. అన్ని వేడుకులకు ధరించేలా వీటిని డిజైన్ చేశారు. వాచ్ గానే కాకుండా చేతికి వేసుకునే బ్రేస్ లైట్లా కూడా ఈ కొత్త ఉత్పత్తులను టామీ కంపెనీ రూపొందించింది. తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై సమంత స్పందించారు. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని.. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత అన్నారు. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొన్నారు.