ప్రియాంకకు తల్లిగా సమంత.. ఇది నెక్స్ట్ లెవల్ ట్విస్ట్

ప్రియాంకకు తల్లిగా సమంత.. ఇది నెక్స్ట్ లెవల్ ట్విస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అప్పుడే తల్లి పాత్రలు చేస్తోంది. అది కూడా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు. ఈ ఇద్దరు చేస్తున్న స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్. అయితే ప్రియాంక హాలీవుడ్ కోసం నటిస్తుండగా.. సమంత ఇండియన్ వర్షన్ లో చేస్తోంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన హాలీవుడ్ మొదటి సీజన్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. దీనికి ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇండియన్ వర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. 

అయితే.. అందరూ అనుకుంటున్నట్టుగా ఇండియన్ వర్షన్, హాలీవుడ్ వర్షన్ కు రీమేక్ కాదట. ప్రీక్వెల్ అట. అంటే.. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నమాట. ఇంగ్లీష్ సిటాడెల్ లో ప్రియాంక కు ఒక తండ్రి ఉంటాడు. అతడు కూడా సిటాడెల్ ఏజెంటే, తనకూతురును ఆమె తాత దగ్గర పెంచినట్లు చెప్తాడు. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ లో ప్రియాంక తల్లిదండ్రుల కథను రివీల్ చెప్పనున్నారట. 1990 కాలంలో ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇక వచ్చే ఏడాది వచ్చే డయానా సీక్వెల్ అన్నమాట. 

ఈ సిరీస్ ఇండియన్ వర్షన్ కోసం ఇక్కడి ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సిరీస్ ఇండియాలో ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.