
రకరకాల పాత్రలతో ఇప్పటికే నటిగా తన టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది సమంత. అయితే మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తూ ఉండటం, అందులోనూ ఆమె టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తోందని టాక్ రావడంతో ‘ద ఫ్యామిలీ మేన్ 2’ మీద అంచనాలు పెరిగాయి. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి లాంటి పాపులర్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. రాజ్ , డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు వస్తుందనేది అనౌన్స్ చేయకపోవడంతో సామ్ అభిమానులు క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు. వారి వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడింది. ఫిబ్రవరి 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రానున్న రెండో సీజన్ మొదటి సీజన్ ని మించి ఆకట్టుకుంటుందని టీమ్ ఊరిస్తోంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ‘ఈసారి ఎవరూ తప్పించుకోలేరు. వెనకాల కనిపిస్తున్న ముఖంలో రహస్యమంతా దాగి ఉంది’ అనే వర్డ్స్ ఆసక్తిని రేపుతున్నాయి. వెనుక కనిపించీ కనిపించకుండా ఉన్న ముఖం సమంతదే. అయితే ఆ ముఖంలో దాగివున్న సీక్రెట్ ఏమిటనేది మాత్రం సిరీస్ చూసి తెలుసుకోమంటున్నారు. మొత్తానికి సామ్ డిజిటల్ ఎంట్రీ సెన్సేషన్ అయ్యేలానే కనిపిస్తోంది. మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలమ్ ’లో నటించడానికి రెడీ అవుతోంది సామ్. ఆల్రెడీ యూనిట్ సెట్స్ వేసే పనిలో పడింది. బహుశా అతి త్వరలో షూట్ కూడా మొదలు కావొచ్చు. అటు తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కాత్తువాక్కు ల రెండు కాదల్ ’ షూటింగ్ లోనూ పార్టిసి పేట్ చేస్తోంది సమంత. కొంతకాలంగా ఆమె వెండితెరపై అంతగా కనిపించడంలేదని ఉసూరు మంటున్న ఫ్యాన్స్ కి ఈ యేడు వరుస ప్రాజెక్టులతో ట్రీట్ ఇవ్వడానికి ప్రిపేరవుతోందన్నమాట.