సమంత హాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం

సమంత హాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా త్వరలోనే స్టేట్స్ పైకి వెళ్లనుంది. 2004 లో ప్రచురించబడిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల అధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు బాఫ్టా-విజేత వెల్ష్ దర్శకుడు ఫిలిప్ జాన్ హెల్మ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో వివేక్ కల్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ సినిమాను చెన్నై స్టోరీస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారట మేకర్స్. తన తల్లి మరణంతో చెన్నై కి చేరుకున్న వ్యక్తి కథతో ఈ సినిమా రానుంది. చిన్నప్పుడే తన అమ్మతో విడిపోయిన తన తండ్రిని వెతికే క్రమంలో ఆ వ్యక్తి సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఒక లేడీ డిటెక్టివ్ సమంత సహాయం తీసుకుంటాడు. ఈ ప్రయాణంలో వారి మధ్య ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, రెండు వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరి వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు ఎలా ఆకర్షితులయ్యారు అనేది మిగితా కథ. 

ఇంగ్లీష్ అండ్ తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి సమంత నటిస్తున్న ఫస్ట్ హాలీవుడ్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.