టాలీవుడ్‌లో ఉత్తమ కోడలు సమంత: ఉపాసన

టాలీవుడ్‌లో ఉత్తమ కోడలు సమంత: ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన  ఒకవైపు ఫార్మా బిజినెస్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు హెల్త్ మ్యాగజైన్ ను నడుపుతున్నారు.  బి పాజిటివ్ పేరుతో ఇటీవలే ఓ మ్యాగజైన్ ను స్థాపించి.. దానికి చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగానే ఆమె అక్కినేని కోడలు సమంతను ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో సమంత ఫిట్ నెస్ కు సంబంధించిన విషయాల గురించి, డైట్ గురించి ఉపాసన అడిగి తెలుసుకున్నారు.

తాను తెలంగాణ ఫుడ్  ఎక్కువ ఇష్ట పడతానని, తీసుకునే ఆహారాన్ని బట్టే దానికి తగ్గట్టుగా వర్కవుట్స్ చేస్తానని సమంత పేర్కొంది. ప్రతీ రోజు వర్కవుట్ ముందు కేలరీస్ కూడిన ప్రోటీన్ షేక్ తీసుకుంటానని, వర్కవుట్ తర్వాత ఎగ్ వైట్స్ తీసుకుంటానని చెప్పింది. తన ఫిట్ నెస్ సీక్రెట్ కు సంబంధించి ఎక్కువగా నీరు తాగుతానని, వెయిట్ లిఫ్టింగ్ కు ఈ అలవాటు ఎంతగానో సాయపడుతుందని చెప్పారు.

నాగార్జున,చైతన్య, సమంత ఫిట్ నెస్ కు సంబంధించి ఎవరు బెస్ట్ అని ఉపాసన అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత.. 60 ఏళ్లు సమీపిస్తున్నా నాగార్జున ఎప్పటికీ ఫిట్ అని అన్నారు.

చేసే పనిని ఇష్టపడుతూ.. ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల..ఎలాంటి సమస్యలు రావని, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల శరీరంలో కూడా ఆ ఫలితాలు కనిపిస్తాయని సమంత అక్కినేని పేర్కొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో సమంతపై ఉపాసన కొణిదెల ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్‌లో ఉత్తమ కోడలు అవార్డు సమంతకే దక్కింది అంటూ ట్వీట్ చేశారు. డంబెల్స్ పట్టుకొని సమంతతో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోకు అనూహ్య స్పందన లభిస్తుంది.