Samantha : అందం తగ్గిందన్న అభిమాని.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన సామ్

Samantha : అందం తగ్గిందన్న అభిమాని..  దిమ్మదిరిగే కౌంటరిచ్చిన సామ్

టాలీవుడ్ అగ్రకథానాయిక సంమంత త్వరలో శాకుంతలం సినిమాతో అలరించబోతుంది. దానికి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన సమంతని చూసి ఒక ఫ్యాన్స్ పెదవి విరిచారు. వాటికి స్పందించిన సమంత, ఘాటుగా సమాధానం ఇచ్చింది. అయితే, గత కొంత కాలంగా సమంత మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దానివల్ల కొంత సమంత కొంత నీరసంగా కనిపించింది.

అయితే, ట్రైలర్ లాంచ్ కి వచ్చిన సమంతను చూసి చాలాకాలం తర్వాత తన అభిమానులు సోషల్ మీడియాలో ప్రేమను కురిపించారు. అలా ఒక అభిమాని అతి ప్రేమ ప్రదర్శిస్తూ ‘సమంతను చూస్తే జాలిగా ఉంది. మయోసైటిస్ వల్ల తన అందం తగ్గిపోయింది. నాగ చైతన్యతో విడిపోయినా దృఢంగా నిలబడుతుందనుకుంటే, ఆమెను మయోసైటిస్ దెబ్బ తీసి  బలహీనురాలిని చేసింది’ అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కి స్పందించిన సమంత ‘నాలాగా కొన్ని రోజులు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదు. మీ అందం మరింత పెరగాలని ప్రార్థిస్తున్నా’ అని సెటైరికల్ గా కౌంటర్ ఇచ్చింది.