
ఇటీవలే ఖుషీ(Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత(Samantha.. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు సామ్. ప్రస్తుతం తన హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉన్నారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ మేటర్స్ ను ఆడియన్స్ తో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తన ఫాలోవర్స్ తో అస్క్ మీ సెషన్ నిర్వహించారు సమంత.
ఈ సెషన్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చి టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయారు. ఇంతకీ ఆ నెటిజన్ ఎం అడిగారంటే.. మీకు రెండో పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఉందా.. అని అడిగారు. దానికి సమాధానంగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సామ్. అది కూడా విత్ ఉదాహారణలతో. ఆ ప్రశ్నకు సమాధానంగా సమంత.. స్టాటిస్టిక్స్ ప్రకారం అదోక చెడు పెట్టుబడి. మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50 శాతం, రెండో పెళ్లికి 67 శాతం, ఇక మూడో పెళ్లికి 73 శాతం ఉంది. అది కూడా స్త్రీ, పురుషుల విషయంలో ఈక్వల్ గా ఉంది.. అంటూ రెండో పెళ్లిపై తనకున్న ఆలోచనని క్లియర్ ఆ చెప్పేసింది సమంత. ప్రస్తుతం సమంత ఇచ్చిన ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.