బుద్ధి ఉందా..రూమర్స్ పై సమంత రియాక్షన్

బుద్ధి ఉందా..రూమర్స్ పై సమంత రియాక్షన్

తిరుమల: కొన్ని రోజులుగా హీరోయిన్‌ సమంతపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమె విడాకులు తీసుకోనుందా అనే రూమర్స్ వస్తుండగా.. ఇప్పటివరకు నాగార్జున, చైతు, సమంత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే రూమర్స్ పై సమంతను ఓ మీడియా ప్రతినిధి అడుగగా ఘాటుగా స్పందించింది. శనివారం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌..మీ గురించి రూమర్స్‌ వస్తున్నాయంటూ ప్రశ్నించడంతో సీరియస్‌ అయిన సమంత.. గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి.. అసలు బుద్ధి ఉందా అంటూ ఘాటుగా జవాబిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవలె శాకుంతలం షూటింగ్‌ పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.