
సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన సమంత.. ‘ఫ్యామిలీమేన్ 2’ వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందుకే ఈసారి ఆమె సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఉండబోతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాకి కమిటైంది సమంత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హరి–హరీష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నిన్న హైదరాబాద్‌లో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లా డుతూ ‘హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’తో పాటు మరో మూడు చిత్రాలు తీశాను. నానితో ‘జెంటిల్‌మేన్’, సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంతతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న థ్రిల్లర్. సమంత క్రేజ్‌కి, పొటెన్షియాలిటీకి, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి తగ్గ కథ’ అని చెప్పారు. మార్చి కల్లా షూటింగ్ కంప్లీటయ్యేలా ప్లాన్ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిలసౌ, రిపబ్లిక్ చిత్రాలకు పని చేసిన ఎం.సుకుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.