
సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల యేటిగట్టు). ‘హనుమాన్’ నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం హీరో సాయి దుర్గ తేజ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ‘అసుర ఆగమన’ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. పవర్‌ఫుల్ యోధుడిగా తేజ్‌ను పరిచయం చేసిన ఈ గ్లింప్స్‌లో.. తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లో ఇంటెన్స్ ఇంప్రెస్ చేశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు దర్శకులు దేవకట్ట, వశిష్ట, విఐ ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. క్వాలిటీ అవుట్‌పుట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఖర్చుకి వెనకాడకుండా నిర్మాతలు సపోర్ట్ చేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్ సహా టెక్నికల్ టీమ్ అందరూ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు రోహిత్ విజన్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా’ అని అన్నాడు. దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం తేజ్ ఎంతో ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. అది అంత ఈజీ కాదు.
ఆయన బౌన్స్ బ్యాక్ అయిన విధానం చాలా స్ఫూర్తినిస్తుంది. ఇందులో నా ఎఫెక్ట్ కంటే టీమ్ అందరి ఎఫర్ట్ ఎక్కువగా ఉంది’ అని చెప్పాడు. నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ అత్యద్భుతంగా పనిచేశారు. ఆయన్ను గ్రాండ్‌గా చూపించాలనే ఈ సినిమా తీస్తున్నాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’ అని చెప్పారు.