- జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘటన
గొల్లపల్లి, వెలుగు : ఒకే వ్యక్తి, ఒకే నెలలో ఏడుసార్లు పాముకాటుకు గురైనా.. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ఐతం శ్రీకాంత్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో తన ఇంటి పరిసరాల్లో పాము కరిచి. వెంటనే హాస్పిటల్ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకొని ఇంటికి వచ్చాడు.
కొన్ని రోజుల తర్వాత మరోసారి పాము కాటు వేయడంతో మళ్లీ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. పాము కరిచిన ప్రతీసారి హాస్పిటల్‌కు వెళ్లడం.. ట్రీట్‌మెంట్ తీసుకొని రావడం అలవాటుగా మారిపోయింది. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో ‘పాము పగ బట్టిందా’ అని చర్చించుకుంటున్నారు.
