పవన్కు వచ్చే ఎన్నిక‌ల్లోనూ అదే రిపీట్‌ 

పవన్కు వచ్చే ఎన్నిక‌ల్లోనూ అదే రిపీట్‌ 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమేన‌ని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నిక‌ల్లో పవన్‌ను రాష్ట్ర ప్రజ‌లు రెండు చోట్ల ఓడించారని.. 2024 ఎన్నిక‌ల్లో అదే రిపీట్‌ అవుతుందని చెప్పారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమన్న ఆమె.. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని ఆమె తెలిపారు. బద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా తెలిపారు. 

మరిన్ని వార్తలు..

ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేతిలో బందీగా తెలంగాణ

రేపు సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్‌