సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు 1,10 0 కి.మీ. సైకిల్ యాత్ర

సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు 1,10 0 కి.మీ. సైకిల్ యాత్ర

కొందరు యాక్టర్లని దేవుళ్లుగా కొలుస్తారు. వాళ్లపై అభిమానాన్ని చాటడానికి రకరకాల పనులు చేస్తుంటారు. అలాంటిదే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌‌కి చెందిన సమీర్‌‌  అనే వ్యక్తి చేశాడు. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌ని దేవునిగా కొలిచే సమీర్.. జబల్‌పూర్‌‌ నుంచి ముంబైలో ఉన్న సల్మాన్ నివాసానికి దాదాపు 1,100 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాడు. చివరికి సమీర్..హీరో సల్మాన్ ని కలిసిన ఫొటో దిగాడు. ఈ ఫొటోను సల్మాన్ ఖాన్ అఫీషియల్ ఫ్యాన్ పేజల్ లో పోస్ట్ చేసేసరికి, ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమీర్.. సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యమన్ ఆర్గనైజేషన్ తో చేస్తున్న మంచి పనులకు గుర్తుగా తన సైకిల్ పై బీయింగ్ హ్యమన్ అని రాసుకున్నాడు. సైకిల్ ముందు ‘చలో ఉంకో దువాయే దేతే చలే. జబల్‌పూర్ టు ముంబై, దేవానా మై చల’ అని రాసి ఉన్న బోర్డ్ తగిలించుకొని ఈ సైకిల్ యాత్ర చేశాడు. సమీర్ చేసిన సాహసానికి సంతోషించిన సల్మాన్, అతనిని  దగ్గరకు తీస్కొని మర్యాదలు చేశాడు. ఈ పోస్ట్ కి ఇప్పటివరకు 4,989 లైక్స్ వచ్చాయి.