సమీర్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఢిల్లీని గెలిపించిన ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సమీర్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఢిల్లీని గెలిపించిన ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 6 వికెట్ల తేడాతో లక్నో  పరాజయం

లక్నో: ఐపీఎల్ 19వ సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు చర్చనీయాంశమైన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ జట్టుకు శుభారంభం అందించింది.  చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో టాపార్డర్ తడబడిన వేళ  ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన సమీర్ రిజ్వీ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70  నాటౌట్‌‌‌‌‌‌‌‌)  దంచికొట్టడంతో  బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డీసీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. ఈ  లో స్కోరింగ్‌‌‌‌‌‌‌‌ పోరులో  తొలుత లక్నో 18.4 ఓవర్లలో 141 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. 

అబ్దుల్ సమద్ (25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 36), మిచెల్ మార్ష్ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి (3/27), టి. నటరాజన్ (3/29), కుల్దీప్ యాదవ్ (2/31) రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రిజ్వీకి తోడు  ట్రిస్టన్ స్టబ్స్ (32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 39 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఆకట్టుకోవడంతో   డీసీ 17.1 ఓవర్లలోనే 145/4  స్కోరు చేసి గెలిచింది.   సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

మార్ష్‌‌‌‌‌‌‌‌, సమద్‌‌‌‌‌‌‌‌ పోరాటం..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయానికి న్యాయం చేస్తూ బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్‌‌‌‌‌‌‌‌తో లక్నోను దెబ్బకొట్టారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తున్న పిచ్‌‌‌‌‌‌‌‌పై వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. లక్నో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ రిషబ్ పంత్ (7) అనూహ్యంగా ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగినప్పటికీ  దురదృష్టవశాత్తు రనౌటవ్వడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. మూడో ఓవర్లో మిచెల్ మార్ష్ కొట్టిన బాల్‌‌‌‌‌‌‌‌ బౌలర్ ముకేశ్ చేతులను తాకుతూ వికెట్లను పడగొట్టడంతో నాన్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్‌‌లో ఉన్న పంత్ నిరాశగా వెనుదిరిగాడు. 

అప్పటికే మూడు ఫోర్లతో జోరు మీదున్న మార్ష్.. ముకేశ్ వేసిన ఐదో ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (11).. అక్షర్ పటేల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో భారీ సిక్స్ కొట్టినా.. తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో పవర్ ప్లేను లక్నో 48/2తో ముగించింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పేసర్ నటరాజన్.. తన మూడో బాల్‌‌‌‌‌‌‌‌కే ఆయుష్ బదోనీ (0)ని డకౌట్ చేసి షాకివ్వగా.. కాసేపటికే డేంజర్ మ్యాన్‌‌‌‌‌‌‌‌ నికోలస్ పూరన్ (8)ను ఎంగిడి ఆఫ్ కట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బౌల్డ్ చేశాడు. మరోవైపు భారీ షాట్లతో ఫిఫ్టీ దిశగా దూసుకెళ్తున్న మార్ష్​ను పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చడంతో 71 రన్స్‌‌‌‌‌‌‌‌కే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ముకుల్ చౌదరి (14), అబ్దుల్ సమద్  వరుసగా రెండేసి ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. కెప్టెన్ అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేయగా.. 14వ ఓవర్లో ముకుల్‌‌‌‌‌‌‌‌ను కుల్దీప్ ఔట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. షాబాజ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌)ను ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దించినప్పటికీ లక్నోకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. అతను స్లోగా ఆడగా.. నటరాజన్ వేసిన 15వ ఓవర్లో సమద్ 6,4 కొట్టాడు.  దాంతో 17 ఓవర్లకు 135/6తో నిలిచిన లక్నో 160 స్కోరు చేసేలా కనిపించింది. 

కానీ, చివర్లో ఢిల్లీ బౌలర్లు మళ్లీ విజృంభించారు. 18వ ఓవర్లో సమద్‌‌‌‌‌‌‌‌, షమీ (1)ని నటరాజన్  ఔట్ చేయగా..  ఆ వెంటనే ఎంగిడి వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో అన్రిచ్ నార్జ్‌‌‌‌‌‌‌‌ (0), మోసిన్‌‌‌‌‌‌‌‌ ఖాన్ (0)ను పెవిలియన్ చేర్చి లక్నో ఇన్నింగ్స్ ముగించాడు. చివరి 4 వికెట్లను 3 రన్స్‌‌‌‌‌‌‌‌ వ్యవధిలోనే కోల్పోయిన లక్నో  తక్కువ స్కోరుకే పరిమితం అయింది. 

టాప్ ఢమాల్‌‌.. ఆదుకున్న సమీర్, స్టబ్స్ 

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కే  స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0)ను గోల్డెన్ డకౌట్ చేసి ఢిల్లీకి షాకిచ్చాడు. షమీ వేసిన ఔట్ స్వింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాహుల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ చేయబోగా ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న బాల్ థర్డ్ మ్యాన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మోసిన్ చేతిలో పడింది. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన నితీశ్ రాణా (15) షమీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఫోర్, సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. కానీ, మోసిన్ వేసిన నాలుగో ఓవర్లో అతను సమద్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో ఓవర్లో ప్రియనస్ యాదవ్‌‌‌‌‌‌‌‌  మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో  పాథుమ్ నిశాంక (1), కెప్టెన్ అక్షర్ పటేల్ (0)ను పెవిలియన్ చేర్చడంతో ఢిల్లీ  26/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. షమీ, మోసిన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో  7 ఓవర్లు ఢిల్లీ  40/4తో నిలిచింది. 

ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ట్రిస్టన్ స్టబ్స్‌‌‌‌‌‌‌‌,  ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. స్టబ్స్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్ రొటేట్ చేయగా..  క్రీజులో కుదురుకున్న తర్వాత రిజ్వీ జోరు పెంచాడు.  అన్రిచ్‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అతను స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. షాబాజ్ వేసిన పదో ఓవర్లో  మూడు ఫోర్లతో విజృంభించాడు. 

తర్వాతి మూడు ఓవర్లలో లక్నో బౌలర్లు ఒక్క బౌండరీ ఇవ్వకపోయినా.. పార్ట్‌‌‌‌‌‌‌‌టైమ్ స్పిన్నర్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ వేసిన 14వ ఓవర్లో భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌, ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 37 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రిజ్వీ  స్కోరు 100 దాటించాడు. మోసిన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ 4, 6తో ఢిల్లీ విజయం ఖాయం చేశాడు. నార్జ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  స్టబ్స్ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొడితే.. సమద్ వేసిన 18వ ఓవర్ తొలి బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్స్‌‌‌‌‌‌‌‌గా మలచిన సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 18.4 ఓవర్లలో 141 ఆలౌట్ (సమద్ 36, మిచెల్ మార్ష్ 36, ఎంగిడి 3/27, టి. నటరాజన్ 3/29). 
ఢిల్లీ: 17.1 ఓవర్లలో 145/4 (సమీర్ రిజ్వీ 70 నాటౌట్‌‌‌‌‌‌‌‌, స్టబ్స్ 39 నాటౌట్‌‌‌‌‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ యాదవ్ 2/20)  
5  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో షమీ తన తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే వికెట్‌‌‌‌‌‌‌‌ తీయడం ఇది ఐదోసారి. లీగ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కుసార్లు తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే వికెట్‌‌‌‌‌‌‌‌ తీసిన బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.