కరోనా నిబంధనల మేరకు సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు

కరోనా నిబంధనల మేరకు సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు
  • కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు: మంత్రి సత్యవతి రాథోడ్

సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కౌన్సిల్ హాల్ లో చిట్ చాట్ నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.  కరోనా ఎఫెక్ట్ తో ముందస్తు దర్శనాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారన్నారు.  రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తున్నారన్నారు. భక్తుల కోసం మెడికల్ క్యాంప్ లు, మాస్క్ లు కూడా జాతరలోనే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. షిప్ట్ వైజ్ గా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ ఎక్కువగా చేస్తున్నామన్నారు. బయో టాయిలెట్స్- రెగ్యూలర్ టాయిలెట్స్ ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. రోడ్లపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. 
క్యూ లైన్లలో రద్దీ లేకుండా.. అర గంటలో దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి. తాగు నీటికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎకరానికి 6 వేల చొప్పున రైతులకు నిధులు ఇస్తున్నామన్నారు. మొత్తం 11 వందల ఎకరాలకు నిధులు అందజేస్తామన్నారు. జాతరకు దగ్గరలో భూమి కొనేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు మంత్రి. 
జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు సత్యవతి రాథోడ్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్పారు. 8 వేల బస్సులు జాతరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఫిబ్రవరి 18న  సీఎం కేసీఆర్ జాతరకు వస్తారన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

రెప్పపాటులో తప్పిన విమాన ప్రమాదం

84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన