జనరలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి సంపూర్ణ్ సమాధాన్ ప్లాన్

జనరలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్  నుంచి సంపూర్ణ్ సమాధాన్ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు:  ప్రైవేట్ జీవిత బీమా సంస్థ జనరలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ్ సమాధాన్ ప్లాన్ అనే కొత్త ప్లాన్​ను గురువారం (అక్టోబర్ 23) ప్రారంభించింది. ఇది టర్మ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (టులిప్​) అని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ జీవితబీమాను అందించడంతోపాటు సంపదనూ సృష్టిస్తుంది.  

వినియోగదారులకు వార్షిక ప్రీమియంకు 100 రెట్ల వరకు లైఫ్ కవరేజీని, మార్కెట్- లింక్డ్ పెట్టుబడుల ద్వారా వృద్ధి అవకాశాన్ని అందిస్తుంది.  పాలసీదారులు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు వ్యవధి, పాలసీ కాలాన్ని ఎంచుకోవచ్చు. సెల్ఫ్​ కంట్రోల్​ లేదా స్మార్ట్ పెట్టుబడి విధానాల ద్వారా పెట్టుబడులను మార్చుకోవచ్చు. 

సంస్థ 10వ, 11వ, 12వ 13వ పాలసీ సంవత్సరాల చివర్లో,  కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. దీనితో పాటు, రెండు ఆప్షనల్​ రైడర్లను కూడా అందిస్తోందని జనరలి సెంట్రల్ సీఈఓ అలోక్ రూంగ్తా చెప్పారు.