అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరం.. క్లారిటీ ఇచ్చిన సంపూర్ణేశ్

అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరం.. క్లారిటీ ఇచ్చిన సంపూర్ణేశ్

బర్నీంగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు(Sampoornesh babu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్(Martin luther king). తమిళ సూపర్ హిట్ మూవీ మండేలా(Mandela) కు రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. కేరాఫ్ కంచరపాలెం(C/O Kancharapalem) ఫేమ్ వెంకటేష్ మహా(Venkatesh maha) సమర్పణల్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రమోషన్స్ మొదలు పనుల్లో వేగం పెంచారు మేకర్స్. 

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా.. ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని కావాలని ఎదగనివ్వడం లేదని, అందువల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్‌ వినిపిస్తోంది అది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నిచారు. దానికి సమాధానంగా సంపూ మాట్లాడుతూ..

Also Read :- OTTకి వచ్చేస్తున్న లియో.. ఇంత తొందరగానా?

అలాటిదేంలేదని, నేను అందరితోనూ బాగానే ఉంటానని, ఇప్పటివరకు నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు నాకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలి చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు సంపూ. ఇక తాను హీరోగా చేస్తున్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తర్వాత వరుసగా ఆ సినిమాలు రిలీజ్ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Beta
Beta feature